ఇరగవరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్

ఇరగవరం ప్రాదమిక ఆరోగ్య కేంద్రం నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ స్వ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను ఇరగవరం వ్యవసాయ సహకార సంఘం అద్యక్షులు వేండ్ర నాగరాజేశ్వరరావు, ఇరగవరం సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామపెద్దలు సమక్షంలో ప్రారంభించిరి . ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీల కు వైద్య సేవలు అందించుటకు స్త్రీల వైద్య నిపుణులు, కంటిపరీక్షలు చేయు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్త పరీక్షలు, వృద్దులకు ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాది పరీక్షలు, సాదారణ అనారోగ్య రోగులను పరీక్షించే వైద్యులు రోగులు కువైద్య సేవలు అంధించిరి. ఈ కార్యక్రమంలో 252 మందికి వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం ఆరోగ్య కేంద్ర వైద్యాదికారి Dr. క్రాంతి రెడ్డి, ప్రోగ్రాం నోడల్ ఆఫీసర్ Dr.K. ప్రతాప్ కిషోర్, న్యూ లైఫ్ హాస్పిటల్ తణుకు నుండి ప్రసూతి వైద్య నిపుణులు Dr.K. వందన, CHO SK ఖాన్ సాహెబ్, కంటి పరీక్షలు చేయుటకు శ్రీ నాగరాజు, ఆరోగ్య శ్రీ సమన్వయ కర్త, వారి సిబ్బంది, స్టాఫ్ నర్స్ లు , MLHP లు , ANM లు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు .

Scroll to Top
Share via
Copy link