స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో శనివారం గ్రామ పరిశుభ్రతపై పర్యావరణ సమతుల్యతపై అవగాహన సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చీపుల్ల కుమారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ పాల్గొన్నారు. మన ఇంటిని మాత్రమే కాకుండా పరిసరాలను గ్రామాలను స్వచ్ఛంగా, పర్యావరణ సమతుల్యత కొరకు మొక్కలను ప్రతి వ్యక్తి నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యత చేపట్టాలని సర్పంచ్ చీపుర్ల కుమారి, ఉపసర్పంచ్ సత్యనారాయణ అన్నారు. అనంతరం గ్రామంలో పలు ప్రదేశాల్లో మొక్కలను నాటారు. ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థులచే మొక్కలను నాటించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ వి. శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


