ఈనెల 24వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద దళిత రణభేరి పేరుతో ధర్నా నిర్వహించనున్నారు దీనికి సంబంధించి ఉండ్రాజవరం మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఛలో విజయవాడ కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపై అనేక చోట్ల పలుమార్లు దాడులు చేయడం జరుగుతుందని, దళితుల పక్షాన నిలబడి పోరాడే ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని బీఎస్పీ నాయకులు అన్నారు. బీఎస్పీ దళితులను చైతన్యం చేసి కూటమి ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధం గా ఉందని, ప్రజలు కూటమి కి అధికారం ఇచ్చింది జగన్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు చేయవద్దని ఇస్తే, కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల కాలం లోనే జగన్ ని మించిన తప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులు కూటమి పాలనలో భయం,భయం గా బ్రతకాల్సి వస్తుందని, ఏ రోజు ఏ దళిత పేట పై దాడి జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో దళితులు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయానే అనే విషయం కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు. కావున ఈనెల 24వ తేదీన జరగబోయే దళిత రణభేరికి మండలంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు, అంబేద్కర్ వాదులు దళిత సంఘాల నాయకులు అందరూ హాజరు కావాలని, బీఎస్పీ మాత్రమే దళితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నదని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో చల్లాబత్తుల సత్యనారాయణ, మర్రి మహాలక్ష్ముడు, బత్తిన ఆశీర్వాదం, డొల్లా జాషువా, నూకపెయ్యి ప్రసన్న బాబు, మేళం చంటి, గొల్ల ధనరాజు, రాయుడు సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు.


