పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు

తణుకులో మొక్కలు నాటి ఎమ్మెల్యే రాధాకృష్ణ

పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ఎండలను తగ్గించుకుని గ్రీనరీ పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు 25వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర సాధించే లక్ష్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. జనవరి 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి నెలా మూడో శనివారం చేపట్టే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ముఖ్యంగా పట్టణాలు, అర్బన్‌ ప్రాంతాల్లో భూమి తక్కువగా ఉండే ప్రాంతాల్లో విరివిగా ఒకే చోట మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రతిఒక్కరు భాగస్వాములు అయ్యే విధంగా సహకరించాలని కోరారు. ప్లాస్టిక్‌ ను పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా ప్రజలు ముందుకు రావాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link