విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్)
వినాయక చవితి సందర్భంగా వనగరంలోని సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ వ్యవస్ధాపకులు సతీష్ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతి 2000 విగ్రహలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే లు వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణ బాబు, అకాడమీ ఫౌండర్ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీ సతీష్ లు మీడియాతో మాట్లాడుతూ మట్టిగణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే విద్యార్ధులతో కలసి దాండియా ఏర్పాటు చేశారు, విద్యార్ధులు సంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గడిచిన ఏడేళ్లుగా నగర ప్రజలకు మా సంస్థ ద్వారా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు.


