ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70 వ పుట్టినరోజు సందర్బంగా వల్లూరు గ్రామంలో పేదవారికి, ఒంటరి మహిళలకు జనసేన పార్టీ తరుపున ప్రతీ నెల కానీ ముగ్గురికి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణి చేసే కార్యక్రమం జనసైనికులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం జనసేన స్తూపం వద్ద మొక్కలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేనపార్టీ జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని మెగా ఫ్యామిలీ అంటేనే సేవకు ప్రతిరూపం అని యువత సేవాకార్యక్రమాలు నిర్వహించడంలో మెగాఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోని ముందు సాగుతున్నారని, మెగాఫ్యామిలీ ప్రేరణతో పేదవారి ఆకలి తీర్చాలానే ఆశయంతో వల్లూరు జనసేన నాయకులు ప్రతీ నెల పేద కుటుంబాలకు కనీసం మూడు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమం ప్రారంభించడం శుభపరిణామం అని, ఈ కార్యక్రమం ద్వారా మునుముందు మరిన్ని ఎక్కువ కుటుంబాలకు అందించేలా విస్తరించాలని, కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు జనసేన పార్టీ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, జనసేన పార్టీ ఆచంట మండలం ఉపాధ్యక్షులు వల్లూరు సొసైటీ అధ్యక్షులు తోట ఆదినారాయణ,వైస్ ఎంపీపీ తాళం శ్రీనివాసరావు, జాతీయ కాపు సంఘం అధ్యక్షులు మండెల శ్రీనివాస్, పోడూరు మండల అధ్యక్షులు రావి హరీష్, పెనుగుండ మాజీ మండల అధ్యక్షులు కంబాల బాబులు, పోడూరు జిల్లాపరిషత్ హైస్కూల్ విద్య కమిటీ చైర్మన్ పట్నాల నాగేశ్వరావు, మండల కార్యదర్శి లు కాపవరపు రామకృష్ణ, పంపన శ్రీను, గ్రామ ప్రధాన కార్యదర్శి దివి సాయిబాబు, తోట సాయిబాబా పెచ్చేట్టి శ్రీనివాసరావు కాంపాటి కార్తీక్,తాళం రమేష్, , ఏడిద బాలు, కంచి ప్రసాద్ మొదలగువారు పాల్గొన్నారు.


