విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్)
29వ వార్డు రామజోగిపేట ఏరియా గల్లీ క్రికెట్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కృష్ణజన్మాస్టమి వేడుకల్లో 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ పాల్గొనడం జరిగింది. నిర్వాహకులు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణుడి విగ్రహానికి పసుపు, కుంకుమలతో, పంచామృతాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దశావతారాల్లో విష్ణు మూర్తి యొక్క అవతారమైన 8వ అవతారం కృష్ణుడని శ్రావణ మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారని, ప్రతి యేటా కమిటీ సభ్యులు ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు జనసేన అధ్యక్షులు నీలం రాజు, 29వ వార్డు కూటమి నాయకులు పల్లా చలపతి, వెంకట అప్పారావు, ఒమ్మి సాయి, లొట్ట సాయి మరియు యువకులు కాయిత మధు, సాయి, పవన్, సాయి తేజ, వర్ధన్, వంశీ, విక్రమ్, ఆరెంజ్ శ్రీను, బాలు తదితరులు పాల్గొన్నారు.


