శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 16 (కోస్టల్ న్యూస్)

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ లో పలు చోట్ల శ్రీ కృష్ణజన్మాష్టమి సందర్భంగా పూజాది కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 29వ వార్డ్ జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ వెంకటేశ్వర్ నగర్ నందగోపాల యూత్ ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆఫీసు రావి దుర్గా గణపతి ఆలయం వద్ద మరియు పంది మెట్ట యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న మన్యాల శ్రీనివాస్ ముందుగా శ్రీ కృష్ణ పరమాత్మునికి పూజాది కార్యక్రమాలు లో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా మన సోదర సోదరీమణులు అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ కృష్ణ భగవానుడు ఈ భువి పై అవతరించిన పర్వదినం శ్రీ కృష్ణ జన్మాష్టమి అని జగత్తు అనే ఈ సృష్టిని నడిపించిన లీలామానుషధారి శ్రీ కృష్ణ భగవానుడు అని ఆకర్షించే దేవుడు శ్రీకృష్ణుడు అని, ధర్మ పరిరక్షణ కోసం పాటుపడిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు అని కొనియాడారు. జన్మాష్టమి సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణునిగా, గోపికలుగా చేసిన వేషధారణలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని తెలిపారు
ఈ సమస్త జగత్తు మీద శ్రీ కృష్ణ భగవానుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సోదర సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link