79వ స్వాతంత్ర్య సందర్భంగా వక్తృత్వ పోటీలు – బహుమతులు ప్రదానం

79 స్వాతంత్ర్య సందర్భంగా తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ డిగ్రీ కాలేజ్ నందు వక్తృత్వ పోటీలు మరియు బహుమతులు ప్రదానం. 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలో గల శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో
మానవ ఆరోగ్యం మరియు సమాజం పై డ్రగ్స్ యొక్క ప్రభావం :డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్ర అనే అంశం పై వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీలలో కళాశాల విద్యార్థినీ ,విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ ఎస్.మణికంఠ రెడ్డి బహుమతులు అందచేశారు. డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్రే ప్రధానమని వారిలో చైతన్యం పెంపొందించటానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన అధ్యాపకులు మరియు తణుకు ఎక్సైజ్ ఎస్. ఐ లు బి.లక్ష్మీ మరియు ఆర్.మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link