:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో కూటమిదే విజయమని వెల్లడి
పులివెందుల ఓటమి జగన్ రెడ్డికి చెంపదెబ్బ అన్న మంత్రి దుర్గేష్
పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఓటేసి కూటమిని గెలిపించారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి విజయం సంతోషాన్నిచ్చిందన్నారు.కూటమి అభ్యర్థులకు భారీ మెజార్టీ రావడం, వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చూస్తుంటే అక్కడి ప్రజలకు వైసీపీపై ఎంత వ్యతిరేకత ఉందో ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు. జగన్ వ్యవహారశైలి అతని పతనానికి నాంది పలికిందన్నారు.ధైర్యంగా ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చామని, ఈ క్రమంలో మూడు దశాబ్దాల తర్వాత పులివెందుల ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓట్లేశారన్నారు.పులివెందుల ఓటమి జగన్ రెడ్డికి చెంపదెబ్బ అన్నారు.ఈ ఫలితాలతో జగన్ కు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లోనూ కూటమిదే విజయమన్నారు. ఇది ప్రజా విజయమని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులకు మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు.


