యస్.కె.యస్.డి మహిళా కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0

స్థానిక యస్.కె.యస్.డి మహిళా కళాశాలలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా “పాఠశాలల్లోను, జూనియర్ కళాశాలల్లోను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రామతి బి. హెచ్. హిమబిందు అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది అన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో విన్నాయని విద్యార్థులందరూ వాటిని సద్వినియోగం చేసుకుని మంచి విజయాలను సాధించాలని అన్నారు. షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులు అందుకున్న ఐదుగురు విద్యార్థినిలను అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మంచి క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో అనేక విజయాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి విచ్చేసినీ DIED G. ప్రభాకరరావు మాట్లాడుతూ నూతన విద్యా విదాసంలో భాగంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు కళాశాల యాజమాన్య కమిటీల సమన్వయం అవసరమని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని, “తల్లికి వందనం” పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మంచి క్రమశిక్షణలో విద్యనభ్యసించి భవిష్యత్తులో వివిధ పోటీ పరీక్షలలో పాల్గొని విజయాలను సాధించాలన్నారు. పూర్వ విద్యార్థిని తల్లి B. శైలకుమారి (అడ్వకేట్ తణుకు) మాట్లాడుతూ తమ కుమార్తె – దేవాలయం వంటి ఈ కళాశాలలో చదవడం వలన మంచి క్రమశిక్షణతో చదువుకొని ఇంటర్ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు కనబరిచిందని ఆనందం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు, తల్లులకు (డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి, సైబర్క్రమ్ గురించి అవగాహన కలిగించడం, నవసమాజ నిర్మాణం కోసం పిల్లలు తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం, తల్లులకు వందనం కార్యక్రమం మరియు గేమ్స్ నిర్వహించి బహుమతులు ప్రదాదం చేయడం జరిగింది. విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link