ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా నిడదవోలులో మిస్టర్ సోల్జర్ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన మంత్రి కందుల దుర్గేష్
మిస్టర్ సోల్జర్ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
నిడదవోలు: వెండితెరపై దేశ సైనికుల గొప్పతనాన్ని వివరించేలా యదార్థ గాథలతో చిత్రీకరించిన ”మిస్టర్ సోల్జర్ ”చిత్రం అఖండ విజయం సాధించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. గురువారం నిడదవోలు పట్టణంలోని శ్రీరంగ సుబ్బారావు,సత్యవతి కాపు కళ్యాణ మండపంలో “మిస్టర్ సోల్జర్ ” చిత్రం ఫ్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నుండి సుమారు 13 కిలోమీర్లు దూరంలో గల మిలిటరీ మాధవరం గ్రామాన్ని ఆదర్శంగా చేసుకొని శ్రీ ధరణి ఆర్ట్స్ బ్యానర్ పై వీఆర్ఎమ్ పట్నాయక్, యూఎస్ఎన్ పట్నాయక్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు బాలాజీ ముత్యాల దర్శకత్వంలో పృథ్వీరాజు, గోలీసోడా మధు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ సోల్జర్’. ‘ఫ్రమ్ మిలిటరీ మాధవరం’ అనేది ఉపశీర్షిక అని తెలిపారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ గ్రామం నుంచి ఎంతోమంది దేశరక్షణలో సైనికులుగా తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు. ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మరి ముఖ్యంగా యువత ఈ తరహా చిత్రాలను చూసి ప్రేరణ పొందాలని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జమ్ము కాశ్మీర్ సమీపంలోని పహల్గా ఉగ్రవాద దాడిని, అందులో ప్రాణాలు కోల్పోయిన అమాయకులైన పర్యాటకులు, ప్రజల గురించి, అనంతరం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ సింధూర్ లను గురించి మంత్రి వివరించారు.
ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కుటుంబ సమేతంగా వీక్షించి, ఆదరించి విజయమందిస్తారని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు…


