పోడూరు: ప్రతీ భారతీయ పౌరుడూ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలని యం.పి.టి.సి విప్పర్తి శారద అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం చింతలగరువు మండలపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్.యం. కొల్లాబత్తుల సూర్యకుమార్ జాతీయజెండా ఎగురవేశారు. విద్యార్ధులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ వడ్లపాటి రాజేంద్ర ప్రసాద్, టీచర్ వీరవల్లి బాలాజీ, రిటైర్డ్ టీచర్ జి.రామారావు, యస్.యం.సి. చైర్మన్ బి.వీరాంజనేయులు, వైస్ సర్పంచ్ కె.లోహిత దాసు, శీలం శ్రీనివాసు, శీలం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


