గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు సర్పంచుల విభాగంలో ప్రత్యేక అతిధులుగా తూర్పుగోదావరిజిల్లా నుంచి హాజరైన నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కే.సావరం గ్రామ సర్పంచ్ సర్పంచ్ నార్ని రామకృష్ణ. సర్పంచ్ గా చేసిన విశేషకృషితో ఈఅవకాశం దక్కించుకున్న నార్ని రామకృష్ణను రాష్ట్ర పర్యాటక, సినీమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంలో ప్రత్యేకంగా అభినందించారు. మండల సర్పంచులు, జనసేన, టిడిపి, బిజేపి నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.


