తణుకు మానవత సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ SNVT జూనియర్ కళాశాల కంప్యూటర్ ల్యాబ్ కు అమెరికన్ టెలిఫోన్ & టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారిచే స్పాన్సర్ చేయబడిన కంప్యూటర్ సిస్టమును ప్రిన్సిపాల్ తులసి కి అందజేయడమైనది.
ఈ సందర్భంగా జిల్లా శాంతి ర్యాలీ కమిటీ చైర్మన్ గమిని రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే కంప్యూటర్ను అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు.
రాష్ట్ర కన్వీనర్, విస్తరణ మరియు అభివృద్ధి కమిటీ, మానవతా ఆంధ్రప్రదేశ్ డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి మాట్లాడుతూ గత ఆరు నెలల క్రిందట ఇదే కళాశాలకు ఒక కంప్యూటర్ సిస్టమును అందించామని కళాశాల వారు ఇంకొక సిస్టం కావాలని కోరగా హైదరాబాదుకు చెందిన అమెరికన్ టెలిఫోన్ & టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిచే స్పాన్సర్ చేయబడిన కంప్యూటర్ సిస్టమును అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరు ఏ కోర్సు చదివిన మరల కంప్యూటర్ విజ్ఞానం అనేది చాలా అవసరం అవుతుందని., విద్యార్థులు కంప్యూటర్ ద్వారా వారికి అవసరమైన విషయాలు నేర్చుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ సిస్టంను ఈ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కోడూరి నాగగోపాల శ్రీనివాసు ద్వారా వచ్చిందని, ఈ సందర్భంగా కంపెనీ వారికి నాగ గోపాల శ్రీనివాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరికొన్ని సిస్టమ్స్ ఇస్తామని వారు తెలియజేశారని అవసరమైన వారికి కంప్యూటర్స్ ను అందజేస్తామని అన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ తులసి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు మండలం అధ్యక్షురాలు కటారి శారదా దేవి, కార్యదర్శి బొల్లం రామ కాశి, ట్రెజరర్ అక్కిన కాశీ విశ్వనాథం, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వంగూరి హనుమంతరావు, మానవతా సభ్యులు కటారి కాశీ విశ్వనాధ రాజు, దాట్ల సత్యనారాయణరాజు, పాతూరు శివన్నారాయణ, బి వి కే ప్రసాద్, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కే. రామలక్ష్మి, కే వాణి, ఆలపాటి సుబ్బారావు, కెవి రమణమూర్తి, మానవతా సభ్యులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.


