నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

గురువారం నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన చేశారు.ఈ సందర్బంగా నిడదవోలు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. రాజమహేంద్రవరం నుండి నిడదవోలు, తాడేపల్లిగూడెం మీదుగా ప్రతిరోజూ వందలాది వాహనాలు, వేలాది మంది ప్రయాణీకులు ప్రయాణించే ఐరన్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో మంత్రి దుర్గేష్ సంబంధిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. సమిశ్రగూడెం మలుపు వద్ద కనీస రక్షణ లేకుండా గ్రిల్ విరిగి ఐరన్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. ఐరన్ బ్రిడ్జిపై కాంక్రీట్ మిక్సర్స్ (ట్రాన్సిస్టర్) మినహా ఏ విధమైన భారీ వాహనాలను అనుమతించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఆదేశించారు. అనంతరం నిడదవోలు డంపింగ్ యార్డ్ ని, చిన్న కాశీ రేవును, టిడ్కో గృహాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి దుర్గేష్ పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న పరిస్థితులను అధికారులు మంత్రికి వివరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ అంశాన్ని సహించబోనని మంత్రి అన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు టిడ్కో గృహాలు అందించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. నేడు భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సమిశ్రగూడెం గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రభ వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రమాదం జరిగింది అంటే ఏం జరిగిందని ఆరా తీయడం కాదు…ప్రమాదం జరగకుండా ఏం చేయాలో చర్యలు తీసుకుంటున్న మంత్రి దుర్గేష్ ను స్థానిక ప్రజలు కొనియాడారు.. ప్రజలకు ఏదైనా సమస్య ఉంది అని తెలిస్తే ఆ సమస్యకు పరిష్కారం చూపడమే ధ్యేయంగా పనిచేస్తోన్న మంత్రి దుర్గేష్ ను నిజమైన నాయకుడు అని నిడదవోలు ప్రజలు కీర్తిస్తున్నారు. మంత్రి దుర్గేష్ తో పాటు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టి.ఎల్.పి.ఎస్.ఎస్. కృష్ణవేణి, మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగారమేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link