500 అడుగుల జాతీయ జెండాతో ఆదిత్య రోబోటిక్ ఏఐ స్కూల్ ఘన గణతంత్ర వేడుకలు..

తణుకు: జనవరి 26, 2026

తణుకు పట్టణం సజ్జాపురంలోని ఆదిత్య రోబోటిక్ ఏఐ స్కూల్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిత్య స్కూల్ చైర్మన్ గురూజు ఆదిశేషు ఆధ్వర్యంలో 500 అడుగుల జాతీయ జెండాతో స్కూల్ ప్రాంగణం నుంచి తణుకు నరేంద్ర థియేటర్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, టిడిపి సీనియర్ నాయకులు కలగర వెంకటకృష్ణ, 29 వార్డ్ ఇంచార్జి కాకిలేటి హరి, తణుకు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జాతీయ నినాదాలతో పట్టణం మొత్తం దేశభక్తి మయంగా మారింది.
ఈ సందర్భంగా కొమ్మిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు పెంపొందించే విధంగా ఆదిత్య విద్యాసంస్థలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. విద్యతో పాటు దేశసేవా విలువలను విద్యార్థుల్లో నాటడం గొప్ప లక్ష్యమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆదిత్య స్కూల్ డైరెక్టర్ రమాకాంత్, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Scroll to Top
Share via
Copy link