తణుకు డిపో సిబ్బంది వేసవి దాహార్తిని తీర్చాలనే సదుద్దేశంతో డిపో సెక్యూరిటీ పాయింట్ వద్ద డిపో మేనేజర్ సుధారాణి మజ్జిగ చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ మజ్జిగ చలివేంద్రమును కేవలం డిపో సిబ్బంది సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉద్యోగి తమ పెళ్లిరోజు లేదా తమవారి పుట్టినరోజు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మజ్జిగ చలివేంద్రం నిర్వహణకు ముందుకు వస్తున్నారని ఇది చాలా మంచి పరిణామం అని వేసవి లో మజ్జిగ శరీరానికి చాలా మేలు చేస్తుందని సిబ్బంది అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు. మొదటి రోజున చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా డిపో మేనేజర్ సుధారాణి, మరియు డి. యం. ఆఫీస్ ఉద్యోగి యామిని తమ కుమార్తె అక్షయ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మజ్జిగ చలివేంద్రం నిర్వహణ కు ఆర్ధిక సహాయం అందించారని ప్రతిరోజు సిబ్బంది ఆర్థిక సహాయంతో ఈ వే సవికాలం అంతా మజ్జిగ చలివేంద్రం నిర్వహణ కొనసాగుతుందని డిపో మేనేజర్ సుధారాణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్ల నాయకులు, సూపర్వైజర్లు, గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, డిపో సిబ్బంది, కార్గో సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link