వార్త‌లు

మానవత్వం చాటుకున్న లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సాయం చేస్తున్నారు. లోకేష్ సేవాగుణంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా.. లోకేశ్ క్షణాల్లో స్పందించడంతో ఒకరికి అవయవ దానం, మరొకరికి ప్రాణదానం జరుగనుంది. గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్‌కు గురి అయ్యారు. దీంతో సుష్మ కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను […]

వార్త‌లు

ఏకగ్రీవమైన కొత్తపాడు ఉపసర్పంచ్ ఎన్నిక

ఇరగవరం మండల పరిధిలో కొత్తపాడు గ్రామపంచాయతీ కార్యవర్గంలో ఆకస్మికంగా ఏర్పడిన ఖాళీతో ఉప సర్పంచ్ పదవికి ఎన్నికను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులతో 27 మార్చి గురువారం నాడు ఉప ఎన్నిక నిర్వహించినట్లు మండల పరిషత్ అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో పదిమంది వార్డ్ మెంబర్లు గ్రామ సర్పంచ్ ఎన్నిక నిమిత్తం హాజరు కాగా సదరు ఎన్నిక కార్యక్రమంలో 8వ వార్డు మెంబర్ దొంగ శ్రీను రెండవ వార్డ్ మెంబర్ అయిన మండపాక

వార్త‌లు

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది వేడుక‌లు సంప్ర‌దాయ‌భ‌ద్దంగా నిర్వహణ – జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్

ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌ నందు వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని గురువారం నిర్వ‌హించారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగువారి సంప్ర‌దాయం ఉట్టిప‌డే విధంగా మామిడాకుల తోర‌ణాలు, అర‌టి చెట్ల‌తో అలంక‌ర‌ణ‌లు చేయాల‌ని సూచించారు. ఉగాది పంచాంగ శ్ర‌వ‌ణం, వేదాశీర్వ‌చ‌నం, ఉగాది ప‌చ్చ‌డి, ప్ర‌సాదాల ఏర్పాటు, వేదిక అలంక‌ర‌ణ బాధ్య‌త‌ల‌ను, వేదిక‌పై బ్యాక్ డ్రాప్ ఏర్పాటును దేవాదాయ‌శాఖ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. సౌండ్ సిస్ట‌మ్, లైవ్

వార్త‌లు

భక్తి, శ్రద్ధలతో ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ, పేద ప్రజలకు దానధర్మాలను అవలంబించడం పవిత్ర రంజాన్ మాసం ప్రతీక

ప్రతి ఒక్క ముస్లిం భక్తి, శ్రద్ధలతో ఆత్మను, శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ, పేద ప్రజలకు దానధర్మాలను అవలంబించడం పవిత్ర రంజాన్ మాసం ప్రతీక అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పరిష్కరించుకుని భీమవరం యల్.హెచ్.టౌన్ హాల్ నందు నిర్వహించిన “ఇఫ్తార్ విందు” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా సూపరింటెండెంట్

వార్త‌లు

పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో రాష్ట్ర పర్యాటక రంగానికి నిధుల వెల్లువ

కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 క్రింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం లభించిందని త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్ రూపురేఖలు మారుస్తామని తెలిపిన మంత్రి దుర్గేష్ ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి సూర్యలంక బీచ్ కు నిధులు ఇవ్వమని కోరిన మంత్రి దుర్గేష్ ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం, పర్యాటకుల స్వర్గధామంగా తీర్చిదిద్దడానికి అవసరమైన

వార్త‌లు

నెలలోపే రైతులకు పంట నష్టం అందిస్తాం – ప్రజా పరిష్కారవేదిక సదస్సులో ఎమ్మెల్యే బొలిశెట్టి

ఎర్రకాల వరదలకు నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం నెలలోపే అందించే ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని ఆరోళ్లలో బుధవారం ప్రజా పరిష్కార వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజలకు సేవ చేసే బాధ్యత తమపై ఉందని అందులో భాగంగానే గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ సమగ్ర అభివృద్ధి

వార్త‌లు

టిడిపి తీర్థం పుచ్చుకున్న ఇద్దరు వార్డు సభ్యులు

ఎమ్మెల్యే రాధాకృష్ణ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరామన్న సభ్యులు అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామానికి చెందిన ఇద్దరు వార్డు సభ్యులు బుధవారం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యులు మల్లుల వరలక్ష్మి, పదో వార్డు సభ్యులు వీరమళ్ల నాగవేణిలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. గత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి ఎమ్మెల్యే రాధాకృష్ణ

వార్త‌లు

మతసామరస్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత

ముస్లింల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 5,434 కోట్లు అత్తిలి ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతసామరస్యాన్ని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి ముస్లిం జమాత్‌ మసీదులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత

వార్త‌లు

జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం – జిల్లా రవాణా అధికారి

ది 29-03-2025 తేది ఉదయం 10:30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రవాణా అధికారివారి కార్యాలయము రాజమహేంద్రవరం నందు జప్తు చేయబడిన వాహనములకు బహిరంగవేలం నిర్వహించబడుతుందని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా రవాణాశాఖధికారి (RTO) వారి కార్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం వున్న కండీషన్ లో వేలం వేయబడును కావున ఆసక్తిగల అభ్యర్ధులు బహిరంగవేలంలో పాల్గొనువారు ముందుగా వాహనములు తనిఖీ చేసుకొని తదుపరి ఈ కార్యాలయము నందు వేయు వేలం పాటలో పాల్గొనువారు

వార్త‌లు

తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్, మహిళలకు గౌరవం ఇస్తాడని విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం – నవతరం పార్టీ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి వ్యక్తి మహిళలకు గౌరవం ఇస్తాడని మాజీ మంత్రి విడదల రజని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే సర్టిఫికెట్ చెల్లదని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో అన్నారు. చిలకలూరిపేటలో విడదల రజని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే హక్కు కోల్పోయిన విషయం మరచిపోయారని అన్నారు. సాక్షాత్తు పార్లమెంటరీ పార్టీ నేత నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ని పట్టుకొని “నీచుడు”అని సంభోదించడం

Scroll to Top