ఉండ్రాజవరం మండలం బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా ఫూలే జయంతి
మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో మండల బిజెపి కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు కోప్పినీడి సత్యనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, సామాజిక సమానత్వం, మహిళా అభ్యున్నతి, ప్రతి ఒక్కరికి చదువు వంటి మహోత్తర సంస్కరణలకు బీజం వేసిన మహాత్మ జ్యోతిరావు మనకు ఆదర్శమని అన్నారు. […]










