వైద్య రంగంలో డాక్టర్ బీసీ రాయ్ అందించిన సేవలే నేటి వైద్యులకు స్పూర్తి అని పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం, మండల కార్యవర్గ ఎన్నికలు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన గౌడ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులతో విశేష సేవలందించిన డాక్టర్ బీసీ రాయ్ నేటితరం వైద్యులకు స్పుర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తణుకు కు చెందిన నంబూరి హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ నంబూరి రాజేష్ విచ్చేసి మాట్లాడుతూ డాక్టర్ బీసీ రాయ్ వైద్య లింగానికి చేసిన సేవలు మరవలేమని, ఆయన అందించిన సేవలను కొనియాడారు. డాక్టర్ బీసీ రాయ్ 1882 జులై 1వ తేదీన జన్మించి,1962 జులై 1వ తేదీన మరణించారని ఆయన జయంతి, వర్ధంతి ఓకే రోజు కావడంతో ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నంబూరి రాజేష్ ను సభ్యులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మండల కార్యవర్గ ఎన్నికలలో మండల నూతన కమిటీ అధ్యక్షులుగా టేకి వీరభద్రరావును, మండల నూతన కమిటీ కార్యదర్శిగా జుత్తుగ సుధాకర్ ను, నూతన కమిటీ కోశాధికారిగా సీహెచ్ ఎస్జీ కిరణ్ ను, గౌరవ అధ్యక్షులుగా ఎస్ఎమ్ జిన్నా, ఉపాధ్యక్షులుగా పి. లక్ష్మీదుర్గ, సహాయ కార్యదర్శిగా కక్కిరాల వీరభద్రం లను ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఈ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పీ.దేవానందం, సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బి. నాగేశ్వరరావు, ఎమ్. సుందరరావు, సోమేశ్వరరావు, ఎమ్. ముత్తయ్య, కె. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



