సాహితీ సామ్రాజ్యం అధ్వర్యంలో తణుకు స్థానిక నన్నయ భట్టారక పీఠం వద్ద ఉన్న మహిళాశాఖాగ్రంథాలయ ప్రాంగణమందు ఆకాశవాణి 90 వసంతాల వేడుకలో భాగంగా ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాల ఆవిర్భవ దినోత్సవం ఘనంగా మంగళవారం నిర్వహించినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ ఆకాశవాణి 8 జూన్ 1936 న ఆవిర్భవించిందని, 16జూన్ 1938 న తొలి తెలుగు ప్రసారాలు ప్రారభమయినాయని, ప్రపంచంలోని అతిపెద్ద రేడియో వ్యవస్థలలో ఒకటి అని అన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అనేకప్రసంగాలు, కథలు, కథానికలు చదివి వినిపించిన రచయిత్రి యర్రమిల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ వన్నెతగ్గని ఆకాశవాణి సేవలను, విశిష్టతను గుర్తించి విజ్ఞానాన్ని పెంపొందించుకోండని అన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి విశిష్టత వైభవం అనే అంశంపై సదస్సు నిర్వహించి, పలువురు మాట్లాడినారు. అనంతరం రచయిత్రి యర్రమిల్లి విజయలక్షి, విశ్రాంత గ్రంథాలయాధి కారిణి పొన్నపల్లి రాజ్యలక్ష్మి, ప్రస్తుత గ్రథాలయాధి కారిణి సీతాల ప్రవీణలను, నిర్వాహకులు ఘనంగా సత్కరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో చదువరు కోటిపల్లి శివపార్వతి, ఈడేపల్లి సూర్యావతి, వై. శీతామహలక్ష్మి, ఎ. లక్ష్మీదేవి, జి. దానమ్మ, బి. సావిత్రి, పి. యస్. యన్ పార్వతి, వై. సత్యనారాయణ, జి. లక్ష్మణయ్య పాల్గొన్నారు.




