వేల్పూరులో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్
తణుకు మండలం వేల్పూరు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన అభయాంజనేయస్వామి వారిని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం దర్శించుకున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో గ్రామంలో 45 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించిన విషయం తెలిసిందే. సోమవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి అనంతరం మాట్లాడారు. అభయాంజనేయస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, దేశ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి, సంక్షేమం జరగాలని వారికి కూడా అభయాంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



