బౌద్ధ దమ్మపీఠంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి  

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బౌద్ధ దమ్మ పీఠాధిపతి బంతి అనాలియో మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం, మహిళా సాధికారత కోసం, స్త్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప దార్శనికులు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆనాడే మహిళా విద్యకు శ్రీకారం చుట్టడం తో పాటు అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ‘సత్యశోధక సమాజ్’ను స్థాపించి సమానత్వ భావనను పెంపొందించారు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన వంటి అంశాల్లో ఆయన చేసిన కృషి అపారమైంది. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండలం బిజెపి అధ్యక్షులు కొప్పినిడి సత్యనారాయణ,  జిల్లా బిజెపి నాయకులు అక్కిన గోపాలకృష్ణ,  బౌద్ధాశ్రమ నిర్వాహకులు బూరుగుపల్లి కళారావు, ఉండ్రాజవరం మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.వి.రాము కార్యదర్శి ఎస్.ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link