లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి

లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త పిలుపులోని అనుసరించి సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇరగవరం మండల కేంద్రంలో లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కామనమునిస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలన్నిటిని మార్చి వేసిందని 44 లేబర్ చట్టాలను మార్చివేసి నాలుగు లేబర్ కోడ్స్ గా ఏర్పాటు చేసిందని అన్నారు. పనిచేసే కార్మికునికి కొత్త చట్టాల వలన ఎటువంటి రక్షణ, ఉద్యోగ భద్రత లేదన్నారు. అనేక మంది ప్రాణత్యాగ ఫలితంగా ఎనిమిది గంటల పనిదినాలను సాధించుకున్నారని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని12 గంటలకు మార్చారని అన్నారు. మహిళలు అర్ధరాత్రి షిఫ్ట్ లో పనిచేయవచ్చునని చెప్పడం దుర్మార్గమైన చర్యని అన్నారు. కనీసవేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన దానిని అమలు చేయడం లేదన్నారు. పాత లేబర్ కోడ్స్ని అమలు చేయాలని కొత్త వాటిని రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఫ్యాక్టరీలలో తనిఖీ విధానాన్ని నిలుపుదల చేశారని దీనివల్ల కార్మికులకు రక్షణ కరువైందని అన్నారు. కాంట్రాక్టు, హౌస్ సోర్సింగ్ విధానాల వల్ల కార్మికులకు చట్టాలు ఏవి వర్తించుము లేదని అన్నారు. కార్మికులంతా ఐక్యంగా పాత చట్టాలు అమలు అయ్యేవరకు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link