తేతలిలో ఘనంగా సైన్స్ దినోత్సవం

తేతలి ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ మరియు సైన్స్ రంగోలి పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సైన్స్ ఉపాధ్యాయులు పి. గంగాభవాని, బి.ఎం.గోపాల రెడ్డి, డి.వి.ఎస్. మారుతిరామ్, పిడి వెంకటేశ్వరరావు విద్యార్థులలో ప్రేరణ కలిగించే, మూఢనమ్మకాల గుట్టు విప్పే మ్యాజిక్ లు ప్రదర్శించారు.
సైంటిఫిక్ మెజీషియన్ గోపాల రెడ్డి కొబ్బరికాయపై మంటలు, సీసాలో దయ్యాన్ని బంధించడం, విద్యార్థి తలపై టీ కాయడం, ప్లాస్టిక్ దెయ్యం మొదలైన ప్రదర్శనలు చేశారు.
సైన్స్ దినోత్సవ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కోట ప్రసాద్, జీవ శాస్త్ర ఉపాధ్యాయుని పి. గంగాభవానిలను ఘనంగా సన్మానించారు.
వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో కె.పుల్లారెడ్డి, జె. రాజకుమారి, జి. సుధారాణి, జి.స్వతంత్ర భారతి, జె. బుచ్చియ్య, ఎం.ఎన్. పుష్పవల్లి, ఎం. సూర్యచంద్ర కుమారి, వి. బాల సరస్వతి, జి. దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link