విజయవాడలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో గౌరవంగా, ప్రేరణాత్మకంగా అనిపించిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.

ఈ శిక్షణ మహాభియాన్ రాష్ట్రం మరియు దేశ అభివృద్ధికి కట్టుబడి ఉన్న కార్యకర్తలకు ఒక గొప్ప వేదికగా నిలుస్తోందన్నారు. సమాజ సేవ, సుశాసనం మరియు సమగ్ర అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం మరింత దిశానిర్దేశం చేస్తోందని తెలిపారు.

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచనలు అంత్యోదయం, స్వదేశీ భావన, సమగ్ర మానవతా సిద్ధాంతం ఇవి ప్రతి కార్యకర్తకు మార్గదర్శక సూత్రాలుగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్సాహం, నూతన దిశ మరియు సేవా సంకల్పం మరింత బలపడిందని డాక్టర్ ముళ్ళపూడి రేణుక అన్నారు. మనమందరం కలిసికట్టుగా సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link