కాకినాడ చైతన్యకళాశాలలో కేంద్ర బడ్జెట్ 2026 పై యువసంవాద్

కేంద్రప్రభుత్వం 2026 బడ్జెట్ పై కాకినాడ పట్టణంలో గురువారం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కాకినాడ జిల్లా బిజేపి అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో యువమోర్చా అధ్యక్షులు మునగల సాయి గోపి అధ్యక్షతన “యూనియన్ బడ్జెట్ 2026 – యువ సంవాద్” కార్యక్రమం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక ముఖ్యఅతిథిగా పాల్గొని యువతి, యువకులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ 2026లో యువతకు సంబంధించిన వివిధ అవకాశాలు, ఉపాధి సృష్టి, స్టార్టప్‌ల ప్రోత్సాహం, విద్యారంగ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. యువత దేశఅభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, కేంద్ర ప్రభుత్వం యువత సాధికారత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇచ్చి, బడ్జెట్ ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైతన్య కాలేజ్ యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పట్టణ భారతీయ జనతా పార్టీనాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link