ఏపీ పర్యాటక రంగానికి ఇప్పటికే రూ.450 కోట్ల కేంద్ర సాయం: మంత్రి కందుల దుర్గేష్
బడ్జెట్లో పర్యాటక రంగానికి రూ.2438 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ. 3416 కోట్లు కేటాయించడం హర్షనీయం: మంత్రి దుర్గేష్
నూతన బడ్జెట్ తో రాష్ట్రంలో త్వరలో అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయి : మంత్రి దుర్గేష్
ఏపీలో మరింత పర్యాటక అభివృద్ధి జరగనుంది : మంత్రి దుర్గేష్
పర్యాటకుల సంఖ్య పెరిగేలా, పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతులు అందించేలా బడ్జెట్లో కీలక నిర్ణయాలు: మంత్రి దుర్గేష్
ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాశస్త్యం భవిష్యత్ తరాలకు తెలిసేలా డిజిటలైజ్ చేసేలా నిర్ణయాలు ఉండటం సంతోషకరం : మంత్రి దుర్గేష్
పర్యాటకులను ఆకట్టుకునేలా బౌద్ధ సర్క్యూట్లకు, చారిత్రక కట్టడాలకు ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం: మంత్రి దుర్గేష్
10 వేల మంది యాత్ర గైడులకు శిక్షణ నివాలనుకోవడం మంచి నిర్ణయం: మంత్రి దుర్గేష్
సీ ప్లేన్ వయబులిటీ గ్యాప్ ఫండింగ్ స్కీం ప్రకటన, మారుమూల ప్రాంతాలకు విమాన సౌకర్యం అనుసంధానం చేయడం పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వనుంది: మంత్రి దుర్గేష్
యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన: మంత్రి దుర్గేష్
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: మంత్రి దుర్గేష్
దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా బడ్జెట్ ఉంది: మంత్రి దుర్గేష్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైనదిగా భావిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
కేంద్ర బడ్జెట్లో పర్యాటక, ఆతిథ్య, సాంస్కృతిక రంగాలకు పెద్దపీట వేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్


