ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు క్యాంపు కార్యాలయంలో 61 మంది బాధితులకు రూ. 44.80 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్

ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి రూ.4.09 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి

ఆరోగ్యకరమైన సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు: ప్రజారోగ్యానికి ఆర్థిక భరోసానిచ్చి, ఆరోగ్యకరమైన సమాజమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా నిడదవోలు నియోజకవర్గంలో అనారోగ్యం బారిన పడిన 61 మంది బాధితులకు రూ.44,80,458 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ పంపిణీ చేశారు. అందులో 57 మందికి రూ.31,80,458 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ముగురికి రూ. 9 లక్షల ఆర్ధిక సాయం, అదే విధంగా రూ. 4 లక్షల విలువైన ఎల్ వోసీ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం అని , ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 556 మందికి 4 కోట్ల 9 లక్షల 17 వేల 825 రూపాయల లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు, కూటమి ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారుల మొఖాల్లో ఆనందం చూస్తే రాజకీయంగా ఒక నాయకుడికి అంతకన్నా సంతృప్తి ఇంకేముంటుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఒక పక్క పేదరికం, మరో పక్క అనారోగ్యం ఈ రెండూ ఉంటే మనిషి రోజురోజుకూ బలహీనపడుతాడని, ఇలాంటి సందర్భంలో ప్రజలకు తామున్నామన్న భరోసాను కూటమి ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపన్నుల పాలిట బాసటగా నిలిచి అడిగిన వెంటనే ఆర్థికసాయం అందించడం గొప్ప విషయం అన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అందించిన డబ్బును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బందులుండి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నవారికి ప్రభుత్వం అనునిత్యం తోడుంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి నెలా నిర్వహిస్తున్నామని, పేదల పాలిట, పేదల సేవలో, పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

Scroll to Top
Share via
Copy link