తణుకు బాలోత్సవం సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
విద్యార్థుల్లో దేశభక్తి, అభ్యుదయ భావాలు పెంపొందించడానికి బాలోత్సవం పిల్లల సంబరాలు ఉపయోగ పడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో బాలోత్సవం వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. జనవరి 23వ తేదీ నుండి 25వ తేదీలలో జరిగే ఈ కార్యక్రమంలో తణుకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలోని సుమారు 4 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎకడమిక్ అంశాలు అయిన వ్యాసరచన, పద్యం -భావం, క్విజ్, తెలుగులో మాట్లాడటం, మ్యాప్ పాయింటింగ్, మెమరీ టెస్ట్, చిత్రలేఖనం ,ఇంటర్నెట్ సెర్చ్, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, శాస్త్రీయ నృత్యం, ఏకపాత్రాభినయం, లఘు నాటిక, మట్టితో బొమ్మలు, విచిత్ర వేషధారణ ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఎమ్మెల్యే చెప్పారు.

Scroll to Top
Share via
Copy link