కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో ఎమ్మెల్యే రాధాకృష్ణ



కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నరసాపురం మండలంలోని తాను దత్తత తీసుకున్న పెదమైనవారిలంక గ్రామాన్ని మంత్రి సీతారామన్ ఆదివారం సందర్శించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పర్యటనలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నీటిపారుదల శాఖ మంత్రి నిర్మల రామానాయుడుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link