తణుకులో భాష్యం జోనల్ గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ప్రారంభ వేడుకలు

భాష్యం జోనల్ గర్ల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 ఈ రోజు (26-12-2025) ఉదయం 10.00 గంటలకు జెడ్.పి. (బాయ్స్) హై స్కూల్ గ్రౌండ్స్, తణుకు లో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గౌరవ అతిథులుగా నర్సాపురం డివిజన్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  డి. మురళి సత్యనారాయణ, జెడ్.పి. (బాయ్స్) హైస్కూల్ ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి కె. పద్మావతి  పాల్గొన్నారు.

ముఖ్య అతిథి ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ దేశ పురోగతికి విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఉందని, విద్యార్థినులల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడల పాత్ర అపారమని పేర్కొన్నారు. మరియు ఇలాంటి క్రీడా పోటీల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థినీలకు రాష్ట్ర, జాతీయ స్థాయిల వరకు వెళ్లే అవకాశాలు లభిస్తున్నాయని, విద్యార్థినులను ప్రోత్సహించి క్రీడలను తణుకులో నిర్వహిస్తున్న భాష్యం విద్యాసంస్థలను అభినందించారు. మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ డి. మురళి సత్యనారాయణ  మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో క్రీడలు అంతర్భాగమని, ప్రతి పాఠశాలలో క్రీడా కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని, భాష్యం పాఠశాలలు ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని పేర్కొన్నారు. జెడ్.పి. (బాయ్స్) హై స్కూల్ ప్రధానోపాధ్యాయరాలు శ్రీమతి కె. పద్మావతి మాట్లాడుతూ, బాలికలు తమ ప్రతిభను రుజువు చేసుకునేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ మెరుగైన వేదికగా మారుతుందన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాలికలను క్రీడలకు ప్రోత్సహించాలని తెలియజేసారు.
భాష్యం వెస్ట్ జోన్ ఇంచార్జి ఏ. శ్రీమన్నారాయణ రెడ్డి  మాట్లాడుతూ బాలురతో సమానంగా బాలికలను కూడా క్రీడలలో ప్రోత్సహించడానికి భాష్యం విద్యా సంస్థలు ఎప్పుడూ ముందు ఉంటాయని తెలియజేసారు. 
ఈ కార్యక్రమంలో తణుకు ప్రిన్సిపాల్ జి.వి.పాండు రంగారావు, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి. ఎల్.బి. శేషారత్నం, భాష్యం బ్లూమ్స్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ.వి.కె విశాలాక్షి, ఉపాధ్యాయులు, భీమవరం-1, భీమవరం-2, చింతలపూడి, ఏలూరు-1, ఏలూరు-2, కైకలూరు, నల్లజర్ల, పెనుగొండ, తాడేపల్లిగూడెం, తణుకు బ్రాంచీల నుండి 300 మంది విద్యార్థినీలు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link