ప్రముఖ రంగస్థలం కళాకారుడు షణ్ముఖి విజయ్ కుమార్ రాజు తణుకు రోటరీ క్లబ్ ఆవరణలో గురువారం ఏకపాత్రాభినయంతో శ్రీకృష్ణ రాయబారం నాటికను హావభావాలతో విన్యాసం సంభాషణ చాతుర్యం హృద్యంగా పాడిన పద్యాలతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ రంగస్థలం కళాకారుడు అభినవ కృష్ణునిగా పేరుగాంచిన కీర్తిశేషులు ఆంజనేయరాజు పుత్రునిగా శ్రీకృష్ణరాయబారం దృశ్యాన్ని ప్రదర్శించి తండ్రికి తగిన గానగంధర్వుడని నిరూపించారనీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రొ. ఆనందం మస్తాన్ రావు అన్నారు. ఏకపాత్రాభినయం తిలకించిన పట్టణ ప్రముఖులు షణ్ముఖ కళాపీఠానికి ఆద్యులైన ప్రముఖ కవి రసరాజు తదితరులు కరతాల ధ్వనులతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రొటీరియన్లు జి. సుధాకర్, గమిని రాంబాబు, వి. పార్వతి, వి. హనుమంతరావు, వై.బాబూరావు, రెడ్డి రంగారావు, నందిగం సుధాకర్, ఆకర్ల సుబ్రహ్మణ్యం, ఆకుల శేషుబాబు, అడ్డాల ప్రసాద్, విహరి, పవన్ రాజు తదితరులు పాల్గొన్నారు.


