తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
తోటి వారికి సాయం చేయడమే ఏసుక్రీస్తు బోధనలు ఆదర్శనియమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. క్రిస్మస్ పురస్కరించుకుని తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా చర్చిల్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగ క్రిస్మస్ అని ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు, పాస్టర్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం రాత్రి నుంచి చర్చిల్లో, పలు సంఘాలు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని కేకు కట్ చేశారు. ప్రతి ఒక్కరు ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, దయ, శాంతిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆయన వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలతోపాటు పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు.


