96 శాతం పిల్లలకు చుక్కలు
సామిస్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 సాధారణ బూత్లు, ఒక మొబైల్ బూత్ ఏర్పాటు చేసి 0–5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు.
బూత్ డే కార్యకలాపాల సందర్భంగా లక్ష్యంగా నిర్ణయించిన పిల్లలలో 96 శాతం మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని, మిగిలిన పిల్లలకు రాబోయే రెండు రోజులపాటు ఇంటింటి సందర్శన (హౌస్ టు హౌస్) కార్యక్రమం ద్వారా పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు.
పిల్లలను పోలియో రహితంగా ఉంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు సహకరించాలని, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఈ సందర్భంగా వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని జెడ్పీటీసీ కే. సూరిబాబు ప్రారంభించగా, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కే. సూరిబాబు , స్థానికులు ఎం.డి. అక్రమ్ , యు. రామ్మోహన్, జి. శ్రీనివాస్ ,
ఎం. దుర్గారావు వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


