ఉండ్రాజవరం మండలంలో పల్స్ పొలియో విజయవంతం

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో 36 పోలియో కేంద్రం బూతుల ద్వారా మొత్తం 6105 మంది పిల్లలకు గాను 5815 మంది పిల్లల కు పోలియో చుక్కల మందు వేశామని ఉండ్రాజవరం ప్రాధమిక కేంద్ర వైద్యాధికారి డా. బి.దుర్గమహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉండ్రాజవరంలో తహసిల్దార్ ప్రసాద్, పాలంగిలో సర్పంచ్  బొక్కాశ్రీనివాస్, చివటం సొసైటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఆంజనేయశర్మ, ఏఎంసి చైర్మన్ జిన్నా బాబు, బి.జె.పి నాయకులు సత్యనారాయణ, వెలగదుర్రులో సర్పంచ్ పద్మావతి, తాడిపర్రు సర్పంచ్ నరేంద్రబాబు, వడ్లూరు వైస్ ప్రెసిడెంట్ సిద్దార్ధ రాజు, వైద్యాధికారి ఉషాదేవి, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు గ్రామాల్లో ఈ  పల్స్ పోలియో బూత్ లను సందర్శించారని వైద్యాధికారి తెలిపారు.

Scroll to Top
Share via
Copy link