ఎర్రంపేట గ్రామంలో రూ.60 లక్షలతో డబ్ల్యూబీఎం రోడ్డుకు శంకుస్థాపన

కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలో సుమారు రూ.60 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం కానున్న డబ్ల్యూబీఎం రోడ్డుకు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఎర్రంపేట గ్రామానికి ఎంతోకాలంగా అవసరమైన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు తోట రవి, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్,జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ,సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, మన్నిడి సాయిబాబా, కోనా కుమార్, ఎర్రంపేట జనసేన అధ్యక్షులు కామిశెట్టి సత్యనారాయణ, సోడాసాని రాజేష్, ఉప్పు శ్రీను, మాధవరపు శ్రీను, పైలా పోసియ, కొండ్రెడ్డి పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link