ఆల్ ఇండియన్ స్టూడెంట్ బ్లాక్ (AISB) రాష్ట్ర విద్యార్థి సంఘనాయకుల ఆదేశాల నేపద్యంలో సోమవారం తణుకులో పశ్చిమగోదావరి జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నల్లమిల్లి వంశీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కొత్త నూతనకమిటీ ప్రకటించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులను కమిటీలో ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా దున్న వెంకట్, వైస్ ప్రెసిడెంట్గా గంగోలు సాయి, తణుకు టౌన్ ప్రెసిడెంట్గా తానేటి అమృత్, వైస్ ప్రెసిడెంట్గా సుంకర పృధ్విరాజ్, సెక్రటరీగా కోట ఖాద్దార్ సింగ్, జాయింట్ సెక్రటరీగా ఏలుపూడి కిరణ్, సోషల్ మీడియా ఇన్చార్జ్గా గోవాడ సమీర్ పీటర్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన విద్యార్ధి సంఘనాయకులను రాష్ట్ర నాయకత్వం విద్యార్ధుల హక్కులు, ఫీజుల నియంత్రణ తదితర అంశాలుపై పనిచేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పలువిద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలనాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.


