వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు నియోజకవర్గంలోని మూడు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం 7.80 కోట్లు మంజూరు చేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరగవరం మండలం రేలంగి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి రూ. 3 కోట్లు, తణుకు మండలం దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయానికి రూ. 3 కోట్లు, వేల్పూరు రుద్రేశ్వర స్వామి ఆలయానికి రూ. 1.80 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇటీవలి కాలంలో ఆలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కూటమి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. 30 శాతం ప్రజల భాగస్వామ్యంతో ఈ నిధులను ఆలయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.


