నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామం నందు సోమవారం “పేదల సేవలో – ఎన్టీఆర్ భరోసా పెన్షన్” పంపిణీ కార్యక్రమంలో పాల్గోని అర్హులైన లబ్ధిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు, నిడదవోలు ఏ.ఎం.సి. చైర్మన్ గాలింకి జిన్నాబాబు, తహసిల్దార్ పిఎండి ప్రసాద్, ఏ.ఓ.వి.వి.వి.ఎస్.రామారావు, వెలగదుర్రు గ్రామ టిడిపి అధ్యక్షులు మూదునూరి రవీంద్రరాజు ఏ.పి.ఎం.బాలక్రిష్ణ, మండలబిజేపి నాయకుడు గొపాలక్రిష్ణ, ఉండ్రాజవరం మండలం టిడిపి యస్సీ సెల్ అధ్యక్షులు పాతూరి నరేంద్రబాబు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బి.శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనలో అర్ధిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సి.యం. చంద్రబాబు ప్రతీ సంక్షేమ పదకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.


