శుక్రవారం అత్తిలి మండలం పాలూరు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతన్న మీకోసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నగరాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు ఈ గ్రామానికి రావడం ఆ అన్నదాత మీకోసం కార్యక్రమంలో భాగంగా పాలూరు గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. చక్కగా చుట్టూ కూడా పంట పొలాలు గడ్డివాములు, వరి బస్తాలు అన్నీ కూడా అందంగా పెట్టుకున్నారన్నారు. గ్రామస్తులు, రైతన్నలు, మహిళా రైతులు అందరూ కూడా ఎంతో ప్రశాంతంగా ప్రొద్దుటే వచ్చి ఈ మీటింగ్ హాజరయ్యారు, మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అన్నదాతల ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతన్నా మీకోసం యాప్ ను రూపొందించిందన్నారు. దీనిని వ్యవసాయశాఖ సిబ్బంది ప్రతి రైతు ఇంటికెళ్లి వారి సెల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసి యాప్ ను ఎలా వినియోగించి సమాచారం తెలుసుకోవచ్చ అవగాహన కల్పిస్తారు అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు పండించే వివిధ పంటలకు అవసరమైన నీటి భద్రత, సాంకేతికత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, ఆహార శుద్ధి, ప్రభుత్వ మద్దతు గురించి రైతులకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ఈనెల 29 వరకు క్లస్టర్ వారీగా సందర్శించి, రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారినుండి సేకరించిన ఫిర్యాదులు, సూచనలు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక అందించి, రైతులకు ఏమి అవసరమో అవి ప్రభుత్వపరంగా కల్పించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ముఖ్యంగా మీ ఎమ్మెల్యేగా రాధాకృష్ణ ఉండడం చాలా అదృష్టం, ఏ విషయమైనా గాని డెవలప్మెంట్ విషయంలో ఏమున్నా గాని ఫాలోఅప్ చేస్తారు. నిరంతరం ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇండస్ట్రియల్ గా ఎలా అభివృద్ధి చేయాలి, రైతుల్ని, పిల్లల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేది ఆలోచనలో ఉండడం అలాంటి నాయకులు దొరకడం మీ అదృష్టం అన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులతో కొన్ని విషయాలను మాట్లాడాలని తెలియజేయడం జరిగిందన్నారు. గతవారం జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మన జిల్లాలో 1,03,800 రైతులకి 68 కోట్ల 73 లక్షల రూపాయలు వారి అకౌంట్లో జరిగింది అన్నారు. స్థానికంగా వినియోగించే వెరైటీలను పండించాలని తెలిపారు. ఇక్కడ ఉద్యానవన పంటలు చూసుకుంటే మన జిల్లాలో తక్కువే ఉన్నాయి. తణుకు సమీపంలో ఆర్కేట్స్ పూల సాగును ఐదు ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన రైతు అధిక లాభాలను పొందుతున్నారని తెలిపారు. దయచేసి అభ్యుదయ రైతులు ఎవరైతే ఉన్నారో వారు హార్టికల్చర్ డిపార్ట్మెంటు సంప్రదిస్తే ఆర్కిట్స్ వేసుకోవచ్చు అని సూచించారు. అలాగే టేబుల్ వెరైటీ, వెజిటబుల్స్ కూడా పండించుకోవడానికి అవకాశం ఉందని, పూలకు కూడా డిమాండ్ ఉందన్నారు. పంట మార్పిడి ఏం చేస్తున్నారు. ఈ సీజన్ లో లక్ష పదివేల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగిందన్నారు. మనకి గత రబీలో జిల్లా వ్యాప్తంగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, ఇది మన రాష్ట్రంలో అత్యధికం అన్నారు. రైతుల పడిన కష్టానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సేకరించిన ధాన్యానికి 24 గంటల్లోనే రైతులకి డబ్బులు పడుతున్నాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లా మొత్తం మీద 43 డ్రోన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అగ్రికల్చర్ లో టెక్నాలజీని వాడుకోవాలని మన ముఖ్యమంత్రి ఎప్పుడు చెబుతూ ఉంటారన్నారు. తద్వారా సాగు ఖర్చు తగ్గుతుంది అన్నారు.
తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు రైతన్న మీకోసం కార్యక్రమం ఇంత చక్కటి ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషం అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి అయ్యిందని, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, సంక్షేమాన్ని అమలు చేస్తూ, ఒక సుపరిపాలనని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. రైతులకు సంబంధించి నీటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కాలువలను మరమ్మత్తులను చేసుకున్నామన్నారు. ఎన్నో కష్టాలు పడి రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటే గత ప్రభుత్వంలో డబ్బులు రావడానికి మూడు నెలల నుంచి ఆరు నెలలు పెట్టేదన్నారు. ఎన్నికల సమయంలో మీరందరూ కూడా చూశారు గత ప్రభుత్వం దాదాపు 1600 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం డబ్బులు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి బకాయిలు అన్నీ వెంటనే తీర్చడం జరిగిందన్నారు. కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పంటలు ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ఇది మూడో విడత ధాన్యం కొనుగోలు అని మీరు ధాన్యం అమ్మి ఇంటికి వెళ్లి లోపు డబ్బులు పడినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది మీరందరూ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలన్నారు. మన నియోజకవర్గంలోనే గత ఖరీఫ్, రబి లకు సంబంధించి దాదాపు 450 కోట్లు విలువైన రెండు లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఆగలేదు అన్నారు. వ్యవసాయ యాంత్రికరణకు సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై కోట్ల రూపాయలు విలువైన డ్రోన్లు, కృషి ట్రాక్టర్లు, స్ప్రేయర్లు ఇటువంటివన్నీ కూడా ఇవ్వటం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 40 డ్రోన్ లు ఇస్తే, ఒక మన నియోజకవర్గంలోనే 11 మంది యువకులకు డ్రోన్లు అందజేయడం జరిగిందని, వాటి ద్వారా మీరందరూ వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఒక్కొక్క డ్రోన్ ఖరీదు 11 లక్షల రూపాయలు అయితే 8 లక్షల రూపాయలు సబ్సిడీతో అందజేయడం జరిగింది అన్నారు. కౌలు రైతులు కూడా ఇబ్బంది లేకుండా అందరికీ పంట సాగు కార్డులను కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 రూపాయలు ఏదైతే ప్రతి రైతుకు అందిస్తామని చెప్పామో, 7000 చొప్పున గత రెండు విడతలలో 14 వేలు జమ చేయడం జరిగిందని, మరొక 6 వేలు జనవరిలో మీ ఖాతాల్లో జమ చేస్తాం అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. గత ఆగస్టులో అధిక వర్షాల వలన పంటలను దెబ్బతినటువంటి పరిస్థితుల్లో ఇన్పుట్ సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. మొంథా తుఫాను కారణంగా మన నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు ఎనుమరేషన్ లో వచ్చిందని, రాబోయే రోజుల్లో వారికి కూడా ప్రభుత్వం పంట నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. 1318 వెరైటీ పండించిన రైతులకు కొంచెం దిగుబడి తగ్గిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లి మీ అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. తొలుత, మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ గోవుకు, ఆవు దూడకు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేశారు. అనంతరం జిల్లాకలెక్టర్, శాసనసభ్యులు డ్రోన్ ను ప్రదర్శించి డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, తణుకు ఏఎంసీ చైర్మన్ రఘువర్మ, సొసైటీ ప్రెసిడెంట్ ధనరాజ్, ఎంపీపీ సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ దయామణి, స్థానిక నాయకులు ఎస్.చందు, ఆనాల ఆదినారాయణ, కొండేటి శివ, తహసిల్దార్ దసిక వంశీ, ఎంపీడీవో శామ్యూల్, కూటమి నాయకులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


