తణుకు. చిల్డ్రన్స్ డే సందర్భంగా గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు ఆదేశముల మేరకు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K కృష్ణ వేణి గారు పిల్లలకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించి భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మరియు బాధ్యతలు గురించి 14 సంవత్సర ల లోపు పిల్లలు అందరు చదువుకోవాలని, పనులు వెళ్లకూడదని, అలాగే బాల్య వివాహలు కు దూరంగా ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహాలు చేసుకోవాలని, అలాగే బాల కార్మిక వ్యవస్థ కు దూరంగా ఉండి చదువుకోవాలని తెలిపారు. గుడ్ టచ్ మరియు బాడ్ టచ్ గురించి తెలియ చేస్తూ సమస్య ఎదురైతే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి న్యాయం పొందవచ్చని తెలిపారు, మహిళలకు ఇతరులనుండి సమస్యలు ఎదురైతే పోలీసు ను సంప్రదించాలని తెలియ చేసారు. ఏ సమస్య వచ్చిన మండల న్యాయ సేవల కమిటీ తణుకు ను సంప్రదించి ఉచిత న్యాయ సహాయం సేవలు పొందవచ్చని తెలిపారు.ఇందులో శ్రీమతి D కృష్ణ వేణి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, న్యాయవాదులు శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, పోణంగి శ్రావణి సమీరా, A అజయ్ కుమార్, Sk mothi, లేబర్ ఆఫీసర్ లు లక్ష్మణ్ కుమార్, శర్మ, CDPO M శ్రీలక్ష్మి, వార్డెన్ Y అరుణ, పారా లీగల్ వాలంటీర్ లు నరసన్న, శ్రీదేవి మరియు lizan ఆఫీసర్ కృష్ణ మూర్తి పాల్గొన్నారు.


