జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఎన్జీవో సభ్యురాలిగా నియమితులైన తణుకు పట్టణానికి చెందిన వి.ఆశాజ్యోతి బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్సీ సంక్షేమ, ఉపాధి అధికారి ఎన్.వి.అరుణకుమారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతోపాటు మురికివాడల్లో నివాసం ఉంటూ చదువుకు దూరంగా ఉంటున్న బాలికలు, తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తుననట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తనవంతు కృషి చేస్తానని ఆశాజ్యోతి వెల్లడించారు.


