మద్యంపై ప్రజలలో నెలకొన్న అపోహలు, అనుమానాలు నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మద్యం కొనుగోలుదారులు ఎవరికి వారు తాము కొనుగోలు చేసిన మద్యం నాణ్యతను, స్వచ్ఛతను పరిశీలించుకొనే అవకాశం కల్పించింది. తాము కొనుగోలు చేసిన మద్యం ఎక్కడ తయారైంది , ఎప్పుడు తయారైంది, దాని బ్యాచ్ నెంబర్ తదితర వివరాలను ఇప్పుడు ఎటువంటి కష్టము లేకుండా కేవలం సురక్ష యాప్ ద్వారా మద్యం బాటిల్ మూత పై ఉన్న స్టిక్కర్ పై గల క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా కేవలం ఒక సెకన్ లో తెలుసుకోవచ్చు. ఈ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. పెద్దగా చదువుకో లేని వారు కూడా సులభంగా వాడవచ్చు. ఈ యాప్ లో రెండు మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి కస్టమర్ మాడ్యూల్, రెండవది రిటైలర్ మాడ్యూల్. కస్టమర్ మాడ్యూల్ అనేది వినియోగదారుడు తమ కొనుగోలు చేసిన మద్యం యొక్క వివరములను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
రీటైలర్ మాడ్యూల్ మద్యం విక్రయ దారులు మద్యం విక్రయించే సమయంలో ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి అమ్మవలసి ఉంటుంది. ఈ విధంగా స్కాన్ చేసి అమ్మటం ద్వారా నకిలీ మద్యంను గుర్తించుటకు, బెల్ట్ షాపులకు మద్యం తరలకుండా ఉండుటకు తోడ్పడుతుంది.మద్యం కొనుగోలుదారులు మద్యం బాటిల్ మూత మీద గల స్టిక్కర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన అనంతరం పొందిన వివరాలతో మద్యం తయారైన తేదీ, బ్యాచ్ నెంబర్ ను మద్యం బాటిల్ పక్కన ముద్రించి ఉన్న బ్యాచ్ నెంబర్, తయారీ తేదీతో సరిపోల్చుకొని నిర్ధారించుకోవచ్చు. ప్రజలు అనవసరంగా అపోహలకి గురికాకుండా, ఎటువంటి పుకార్లను నమ్మకుండా మద్యం యొక్క నాణ్యతను, వాస్తవికతను, స్వచ్ఛతను ఎవరికి వారే పరిశీలించుకోవచ్చు. ఇందు కొరకు వారి చేయవలసిందిగా గూగుల్ ప్లే స్టోర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
మీ సందేహాలను కొరకు తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారిని 9440902436 సంప్రదించగలరు. ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఎస్ మణికంఠ రెడ్డి మద్యం వినియోగదారులతో ఎక్సైజ్ సురక్ష యాప్ ను డౌన్లోడ్ చేయించడంతో పాటు దాని యొక్క లక్షణాలను వివరించడం, దానిని ఎలా ఉపయోగించాలి అనే దాని మీద వినియోగదారులకు అవగాహన కల్పించారు.


