యూరియాను పంటల అవసరం మేర విక్రయించాలి. కొవ్వూరు సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాస్ ఉండ్రాజవరం మండలంలోని ఎరువుల డీలర్లతోటి సమావేశం స్థానిక ఎంపిడిఓ వారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రస్తుతం ఉద్యాన పంటలకు మాత్రమే యూరియా అవసరం ఉన్నందున ఆ పంటలు సాగుచేసే రైతులకు మాత్రమే యూరియాను అమ్మకాలు చేయాలని దాళ్వాలో కొరత వస్తుంది అనే భావన తోటి కొంతమంది రైతులకు ముందుగా విక్రయాలు జరుపకూడదని తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియాను అందుబాటులో ఉంచే విధంగా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తుందని దానికి తగినట్లుగా ఏనెలలో ఏ మండలానికి అలాగే ఏ గ్రామానికి అక్కడ సాగు చేసే పంటల విస్తీర్ణాన్ని బట్టి యూరియాను కేటాయింపులు జరుగుతున్నాయి కాబట్టి రైతులు యూరియా దొరకదు అనే ముందస్తు ఆలోచనతోటి ఇప్పుడే కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దు అని రైతులకు అవగాహన కల్పించాలనీ డీలర్లకు తెలిపారు. ఎరువులు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా రైతుకు బిల్లు ఇచ్చి ఈపాస్ నందు బయోమెట్రిక్ వేయించాలని తెలిపారు అలాగే యూరియా విషయంలో ఆ రైతు ఏపంట కోసం తీసుకు వెళుతున్నారు. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు అనే పూర్తి వివరాలు తీసుకున్న తరువాత మాత్రమే యూరియాను విక్రయించాలని కోరారు. ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్లు వారి దగ్గర ఉన్న ఎరువుల స్టాకుతో సరిపోయేలా చూసుకోవాలని కోరారు. యూరియాతో పాటు నానో యూరియా లాభాలను వివరించి వాటిని కూడా రైతులు వినియోగించేలా అవగాహన కల్పించాలని డీలర్లకు తెలియజేశారు. యూరియా అనేది వేరే జిల్లాలకు కానీ వేరే మండలాలకు గాని విక్రయించకుండా జిల్లా అధికారుల సూచనల మేరకు డీలర్లు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో బి. రాజారావు, సొసైటీ సెక్రటరీలు, ప్రైవేటు ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.


