తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఇకపై ప్రతినెలా ఆదాయం ఆదా అవుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జీఎస్టీ 2.0 కింద నరేంద్రమోదీ ప్రజలకు కలిగే లబ్థిపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులపై 18 నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా మినహాయించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులపై జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతోందని అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన వస్తువులపై విద్యా, పారిశ్రామిక సంబంధమైన వస్తువులు, ద్విచక్ర, కార్లు వంటి వాహనాలపై జీఎస్టీ తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరోవైపు నిత్యావసర వస్తువులు పుస్తకాలు, స్టేషనరీ, ఔషధాలు, ఆరోగ్యబీమా ప్రీమియం వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడంతో మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతోందన్నారు.


