కొత్త కొత్త యాప్ లు తీసుకొచ్చి కూలీలను ఇబ్బందులకు గురి చేయడం తగదు

ఉపాధి హామీలో అవినీతి లేకుండా చేస్తామని కొత్త కొత్త యాప్ లు తీసుకొచ్చి కూలీలను ఇబ్బందులకు గురి చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ. సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్ర రావు. ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తణుకు మండలం 3.వ మహాసభ తణుకు అమరవీరుల భవనంలో బండారు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభ ప్రారంభానికి ముందుగా సంఘ పతాకాన్ని మద్దూరి సూర్యనారాయణ ఎగరవేశారు. అనంతరం జరిగిన సభలో సత్యనారాయణ.సోమరాజు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 11 సంవత్సరాలుగా ఉపాధి హామీని ఎత్తివేయడం కోసం ఉపాధి హామీలో అధికంగా అవినీతి జరుగుతుందని చెబుతూ కొత్త యాప్ తీసుకు వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని అయితే ఇప్పటికే ఉపాధి హామీలో ఉన్న యాప్ లు వలన కూలీలు ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. కూలీలు వలనే అవినీతి జరుగుతుందని కూలీల మీద నింద వేయడం కాకుండా అవినీతి అనే జబ్బు ఎక్కడ ఉందో అది గుర్తించి జబ్బుకి తగ్గ మందు వేస్తే ఉపయోగం ఉంటుంది తప్ప కష్టజీవులైన కూలీలపై నింద వేయడం సరికాదని వారు మండిపడ్డారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు పూర్తి అయిపోయి పనుల కోసం ఎదురు చూస్తున్న కూలీలకు తక్షణం అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మండల నూతన కన్వీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు కన్వీనర్ గా బండారు వెంకటేశ్వరరావు. సభ్యులుగా ఇళ్ళ వరలక్ష్మి. విశ్వనాథం సుబ్బారావు. వెండ్ర రేణుక. పితాని వెంకటేశ్వరరావు. కత్తుల మేరీ. కారంకి రాజు. వేండ్ర నరసింహా మూర్తి ఎన్నికైనారు. ఈ కార్యక్రమంలో నీలం వెంకట బసవయ్య. వీరవల్లి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link