గ్రామాల్లో బెల్ట్ షాపులను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కలు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం తణుకులోని అమరవీరుల భవనంలో తణుకు డివిజన్ గీత కార్మికుల సహకార సొసైటీల అధ్యక్షులు సమావేశం కట్టా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ గీతకార్మికులు అనేక సమస్యలతో ఉన్నారని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ఈ జిల్లాలో బెల్ట్ షాపులు 4 వేల షాపుల ద్వారా లిక్కర్ వ్యాపారం గ్రామస్థాయిలో అమ్మకాలు జరుగుతున్నవలన గీత కార్మికులు పస్తువులతో కాలం గడుపుతున్నారని అన్నారు. గ్రామాల్లో తాటి, ఈత చెట్లను దౌర్యంగా నరికి వేస్తున్నారని వాటిని మార్కింగ్ ద్వారా ఆపాలని మునుస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికలాంగులైన, మృతి చెందిన వారికి ప్రభుత్వము గతంలో ఎక్స్గ్రేషియా మంజూరు చేసేదని ఇప్పుడు ఎక్స్గ్రేషియా రద్దు చేయడం వల్ల చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని మునిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రమాదశాత్తు మరణించిన వారికి కుటుంబాలకు 10 లక్షలు, మట్టి ఖర్చులు నిమిత్తం 20,000 ఇస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో గీత కార్మికుల పట్ల వ్యతిరేక విధానాలను ప్రభుత్వము అవలంబిస్తుందని వీటిని పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని మునుస్వామి తెలిపారు. ఈనెల 14వ తేదీన కలెక్టర్కు గీత కార్మికుల సమస్యలను చెప్పుకుందాం. తరలి రండి అని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం గీత కార్మికుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత సహకార సొసైటీల అధ్యక్షులు కాసాని శ్రీనివాసు, తొంట ముత్యాలు, కట్ట వెంకటేశ్వరావు,
చిటురి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


