అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక, అక్రమరవాణా దినోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి ఆదేశాలు మేరకు ప్యానెల్ న్యాయవాదులు రిమాండ్ ముద్దాయిలకు అవగాహన కల్పిస్తూ మత్తుపానీయాలకు దూరంలో ఉండాలని, గంజాయి సాగు చేయుట, రవాణా చేయుట, త్రాగుట నేరమని, కఠినమైన శిక్షలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు తెలిపారు, డాక్టర్ శ్రీ రాజ్ మాట్లాడుతూ మత్తుపానీయాలు ద్వారా ఆరోగ్యం పాడవుతుందనీ, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు వస్తాయని, మత్తుపదార్ధాలు జీవితాన్ని నాశనం చేస్తాయని తెలిపారు. న్యాయవాది అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్.డి.పి.ఎస్. గంజాయి కేసులలో శిక్షలు కఠినంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, టి. సత్యనారాయణరాజు, జే.ఆర్.వి.వి.ఎస్ పవన్ కుమార్, అజయ్ కుమార్, డాక్టర్ శ్రీరాజ్, జైలు సూపరింటెండెంట్ జి. మోహనరావు, కాకర్ల నాని, జైలు సిబ్బంది పాల్గొన్నారు.


